నాలుగేళ్ల తర్వాత కన్నవాళ్లను చూద్దామని భారత్‌కి.. విమానంలో సీటు బెల్టుకునే లోపే

 


దాదాపు నాలుగేళ్ల తర్వాత తల్లిదండ్రులను చూడటానికి స్వదేశానికి బయల్దేరిన యువతి విమానంలోనే కన్నుమూసింది. వివరాల్లోకి వెళితే.. క్వాంటాస్ విమానంలో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న 24 ఏళ్ల భారతీయ ఫ్లైట్ టేకాఫ్ కాకుండానే వైద్య పరిస్ధితి విషమించడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సోమవారం మీడియా నివేదించింది. బాధితురాలిని మన్‌ప్రీత్‌కౌర్‌గా గుర్తించారు. 

ఈమె జూన్ 20న మెల్‌బోర్న్ నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న విమానం ఎక్కింది. అయితే ఎయిర్‌పోర్టుకు చేరుకోవడానికి ముందే అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. స్నేహితురాలు చెబుతున్న దానిని బట్టి .. మన్‌ప్రీత్‌కౌర్ 2020 మార్చిలో ఆస్ట్రేలియాకు వెళ్లిన నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా తన తల్లిదండ్రులను చూడటానికి భారతదేశానికి బయల్దేరింది. కానీ విమానంలో సీటు బెల్ట్ పెట్టుకుంటుండగా కుప్పకూలిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. 

క్యాబిన్ సిబ్బంది, ఎమర్జెన్సీ విభాగం ఆమె ప్రాణాలు నిలబెట్టేందుకు ఎంతో ప్రయత్నించింది. కౌర్ విమానం ఎక్కగానే సీటు బెల్టు పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడినట్లు ఆమె స్నేహితుడు గుర్దీప్ గ్రేవాల్ అన్నారు. ఊపరితిత్తుల పనితీరును దెబ్బ చేసే అంటువ్యాధి అయిన క్షయతో కౌర్ చనిపోయినట్లుగా భావిస్తున్నారు. 

కుకరీ చదువుతున్నప్పుడు ఆమె ఆస్ట్రేలియా పోస్ట్‌లో పనిచేశారని , ఏదో ఒక రోజున చెఫ్ కావాలని ఆమె కలలు కన్నారని కౌర్ రూమ్‌మేట్ కుల్దీప్ ఆవేదన వ్యక్తం చేశారు. విక్టోరియాలో తన స్నేహితులతో ప్రయాణించడం ఆమెకు ఎంతో ఇష్టమని వారు గుర్తుచేసుకుంటున్నారు. మన్‌ప్రీత్ కౌర్ కుటుంబానికి ఆర్ధిక సాయం చేసేందుకు ఆమె స్నేహితులు ఆన్‌లైన్‌లో GoFundMe పేజీని ఏర్పాటు చేశారు. క్వాంటాస్ ఎయిర్‌లైన్స్ సైతం మన్‌ప్రీత్ మరణం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 

Comments